ఈ మధ్య కాలంలో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా అడల్ట్ సినిమాలకు ఆదరణ ఎక్కువైపోతుంది. అతి తక్కువ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాలు బాగానే ఆడుతున్నాయి. ఈ క్రమంలోనే పక్కా అడల్ట్ సినిమా అయిన ఏడు చేపల కథ త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. నవంబర్ 7వ తేదీన సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్లు యూ ట్యూబ్ లో మంచి వ్యూస్ రాబడుతున్నాయి.
ఈ చిత్రంలో టెంప్ట్ రవి అనే విభిన్నమైన పాత్రలో కనిపించిన హీరో అభి ఇప్పటికే ట్రైలర్ ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. అడల్డ్ కామెడీ జోనర్ లో పూర్తిగా కొత్త వారితో రూపోందుతున్న ఈ చిత్రంలో అభిషెక్ రెడ్డి తొ పాటు బిగ్ బాస్ ఫేం భాను శ్రీ,, ఆయేషా సింగ్, నగరం సునీల్ తదితరులు నటిస్తున్నారు. ఇక ట్రైలర్ల విషయానికొస్తే టెంప్ట్ రవి అనే పాత్ర అమ్మాయిలు ఎక్స్ పోజింగ్ చేస్తే నిగ్రహించుకోలేడు.
ప్రతిదానికి టెంప్ట్ అయిపోతాడు. అలాగే ఇందులో టెంప్ట్ రవిది ‘మగ వేశ్య’ పాత్ర లాంటిది. ఇందులో హీరో నెలకోసారి బ్లడ్ ఎక్కించుకోకపోతే చనిపోతాడు. ఆ బ్లడ్ కోసం ఏడు చేపల్లాంటి అందగత్తెలతో కామకేళిలో తేలియాడతాడు. ఇక పరమ బూతు సన్నివేశాలతో సాగిన ఈ ట్రైలర్ కుర్రాళ్ళ ని పిచ్చెక్కించడం ఖాయం. ఇప్పటివరకు సినిమాల్లో ఆడవాళ్ళని మగాళ్లు రేప్ చేయడం మాత్రమే చూసాం కానీ ఈ సినిమాలో ఆడవాళ్లు మగాళ్ల ని రేప్ చేసే సన్నివేశాలు చాలా ఉన్నాయి.
మొత్తానికి ట్రైలర్లో రాయడానికి వీలు లేని పదాలతో అశ్లీలత, అసభ్యకరమైన సంభాషణలు ఇందులో చాలా ఉన్నాయ్.. కంప్లీట్ అడల్ట్ కంటెంట్‌తో పచ్చి బూతులు, అశ్లీల దృశ్యాలతో బూతు సినిమాలకు బాస్‌లా ఉన్న ‘ఏడు చేపల కథ’ ట్రైలర్ కామప్రియులకు విపరీతంగా నచ్చేయడంతో యూట్యూబ్‌ని షేక్ చేస్తుంది.