తమిళ స్టార్ ఇళయ దళపతి విజయ్ – డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో వచ్చిన 3వ సినిమా ‘విజిల్’. కోలీవుడ్‌లో బిగిల్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో మహేష్ కోనేరు విజిల్ పేరుతో రిలీజ్ చేశారు. విజయ్ సినిమా తెలుగులో మొదటిసారి 750 థియేటర్స్‌లో రిలీజ్ చేశారు. తెలుగులో విజిల్‌కు రు.10 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఈ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ దీపావళి సీజన్ కలిసి రావడం వల్ల ఓపెనింగ్ వీకెండ్ విజయ్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టింది. మరోవైపు కార్తీ ఖైదీ బాగా పుంజుకోవడంతో పాటు ఆ సినిమాకు సూపర్ టాక్ రావడంతో విజిల్ కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి. 6 రోజులకు విజిల్ ఏపీ, తెలంగాణ ఏరియాల్లో రు. 8.88 కోట్ల షేర్ సాధించింది.
ఇక ఈ సినిమాను తెలుగులో రు.10 కోట్లకు కొని రిలీజ్ చేయగా… ఇప్పుడు మరో రు. కోటి వస్తేనే విజిల్ బ్రేక్ ఈవెన్‌కు వస్తుంది. ఇప్పటికే వసూళ్లు బాగా డ్రాప్ అవ్వడంతో మరి విజిల్ బ్రేక్ ఈవెన్‌కు వస్తుందా ? లేదా ? అన్నది చూడాలి.
ఏరియాల వారీగా ‘విజిల్’ 6 రోజుల కలెక్షన్స్ :
నైజాం – 2.80 కోట్లు
సీడెడ్ – 2.46 కోట్లు
గుంటూరు – 86.5 లక్షలు
ఉత్తరాంధ్ర – 84.9 లక్షలు
తూర్పు గోదావరి – 58.1 లక్షలు
పశ్చిమ గోదావరి – 40.1లక్షలు
కృష్ణా – 55.8 లక్షలు
నెల్లూరు – 36.7 లక్షలు
——————————–
టోటల్ షేర్ – 8.88 కోట్లు
——————————–