రవితేజ గురించి కార్తి చెప్పిన టాప్ సీక్రెట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

రీసెంట్ గా తమిళ హీరో కార్తి నటించిన ఖైది సినిమా రిలీజైంది. లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ లో కార్తి తెలుగు ప్రేక్షకులకు మరోసారి తన థ్యాంక్స్ తెలిపారు. అంతేకాదు సినిమా చూసిన రవితేజ తనకు కాల్ చేసి సినిమా చాలా బాగుందని చెప్పారని అన్నాడు కార్తి.

ఇలాంటి సినిమా తాను చేస్తానని అప్పుడు నువ్వు చూడాలని చెప్పాడట రవితేజ. తప్పకుండా సార్ అని అన్నాడట కార్తి. కార్తి చెప్పిన మాటలని బట్టి చూస్తుంటే రవితేజ కూడా ఖైది లాంటి థ్రిల్లర్ మూవీని చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీసినా ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుంది. అందుకే డిఫరెంట్ గా ట్రై చేయాలని చూస్తున్నాడు రవితేజ.

ప్రస్తుతం రవితేజ డిస్కో రాజా సినిమా చేస్తున్నాడు. వి.ఐ ఆనంద్ డైరక్షన్ లో ఈ సినిమా వస్తుంది. సినిమాలో పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరి రవితేజ కోరుకుంటున్నట్టుగా ఖైది లాంటి కథ అతనికి ఎవరు చెబుతారో చూడాలి. ఖైది సినిమా తెలుగులో ఇంత పెద్ద సక్సెస్ అవడం పట్ల కార్తి సూపర్ హ్యాపీగా ఉన్నాడు. సినిమా వసూళ్లు కూడా బాగానే ఉన్నాయి.

Share.