టాలీవుడ్ లో మరో కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. అందుకు రంగం సిద్దమైంది. త్వరలో పట్టాలెక్కనున్న ఈ మూవీపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతుంది. అవుట్ డేటేడ్ హీరోయిన్ అనుకున్నారంతా.. కానీ ఆ హీరో, దర్శకుడు అమె వైపే మొగ్గారు.. ఇక అమె ఎంపిక కావడం, అదే దర్శకుడు, అదే హీరో.. ఇక మిగిలింది సినిమా పట్టాలెక్కడమే. ఇంతకు ఏ కాంబినేషన్ రిపీట్ అవుతుంది అనుకుంటున్నారా.. అయితే ఓసారి లుక్కేద్దాం..
మాస్ మహారాజా రవితేజ తన కేరీర్ 66వ సినిమాలో నటించబోతున్నారు. ఈసినిమాకు దర్శకత్వం గోపీచంద్ మలినేని. ఈ ఇద్దరిది బలుపు సినిమా కాంబినేషన్. ఇందులో హీరోయిన్గా నటించింది విశ్వనటుడు కమలహాసన్ గారాలపట్టి అందాల శృతిహాసన్. ఈ ముగ్గురు కలిసి రవితేజ 66వ చిత్రం ప్రాజెక్టులో పనిచేయబోతున్నారు.
ఒకే ప్రాజెక్టులో పనిచేసి అదే ముగ్గురు మళ్ళీ కలిసి పనిచేయడం అంటే అరుదు అనే చెప్పవచ్చు. ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో సినిమాపై మంచి అంచనాలే వస్తున్నాయి. శృతిహాసన్ డేటింగ్, ప్రేమ పేరుతో సినిమాలకు చాలా కాలం దూరమయ్యారు. ప్రేమించిన బాయ్ప్రెండ్కు గుడ్బై చెప్పి మళ్ళీ సినిమాల బాట పట్టింది శృతిహాసన్. ఇప్పుడు రవితేజ సరసన నటించబోతున్నారు. ఇందులో రవితేజ పోలీస్ ఆఫీసర్గా నటించబోతున్నట్లు టాక్. సినిమాకు క్రాక్ అని టైటిల్ పరిశీలనలో ఉంది.