ఆర్జీవీ తన తాజా చిత్రం కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాకు తనకు అలవాటైన రీతిలోనే ఊకదంపుడు ఊదరగొట్టుడు ప్రచారం అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే వర్మ తన తదుపరి చిత్రం మెగా ఫ్యామిలీ అంటూ ఓ ప్రకటన కూడా వదిలేశాడు. వర్మ ఆ ప్రకనట చేశాడో ? లేదో ? వెంటనే మెగా అభిమానులు వర్మపై విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. ఇంతలో ఏమైందో గాని వెంటనే తూచ్ అనేశాడు. తాను ఈ సినిమా చేయడం లేదు అంటూ షాకిచ్చాడు.
అందుకు కారణం కూడా చెప్పాడు. మెగా ఫ్యామిలీ కథాంశం .. ఒక మనిషికి మొత్తం 39 మంది పిల్లలు. అంతమంది పిల్లలు ఆ కుటుంబంలో ఉండడం… తాను పిల్లల సినిమాలు సరిగా తీయలేనన్న కారణంతోనే తాను ఈ సినిమా తీయాలనుకోవడం లేదని చెప్పాడు. మొత్తానికి ఆర్జీవీ ప్రమోషనల్ స్టంట్ ఇది అని ప్రూవైంది.
మరో టాక్ ప్రకారం ఆర్జీవీకి ఇండస్ట్రీలోని కొంతమంది ప్రముఖుల నుంచి ఫోన్లు రావడంతో పాటు కొందరు ఆయన్ను వ్యక్తిగతంగా పిలిపించుకుని ఈ సినిమా ఆపేయాలని కాస్త ఘాటుగా చెప్పడంతో వర్మ వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. వాస్తవంగా వర్మ ఇలాంటి బెదిరింపులకు అయితే లొంగడు.. మరి మనోడిని ఎలా ఒప్పించి ఈ సినిమా తీయడం లేదని చెప్పించారో ..?