మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలీస్‌స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ముచ్చటగా మూడో చిత్రంగా వస్తున్నదే అలా.. వైకుంఠపురంలో.. ఈ సినిమా ప్రమోషన్ దసరా నుంచే ప్రారంభించేశారు. సంక్రాంతికి విడుదల చేయాలనుకున్న ఈ సినిమాకు మూడు నెలల ముందు నుంచే ప్రమోషన్ చేస్తూ దుమ్ము రేపుతున్నారు. అయితే ఈ సినిమాకు చేస్తున్న ప్రమోషన్ చూసి అనీల్ అల్లాడిపోతున్నాడని టాక్.
అసలే పెద్ద హీరో, ఆపై వంద కోట్లకు పైగా బడ్జెట్. పోటీగా మాటల మాంత్రికుడు, స్టైలీష్‌స్టార్. ఇద్దరిని ఎలా తట్టుకోవాలో తెలియక పాపం ఈ దర్శకుడు తీవ్ర మనోవేధనకు గురౌతున్నాడని ఫిలింనగర్లో జోరుగా టాక్ వినిపిస్తుంది. ఇంతకు అల్లు దెబ్బకు అల్లాడిపోతున్న ఈ దర్శకుడు ఎవ్వరో కాదు.. అనీల్ రావిపూడి. అల్లు అర్జున్ దూసుకుపోతున్న తీరుకు అనీల్ రావీపూడి బెంబెలెత్తిపోతున్నట్లు అర్థమవుతుంది.
అనీల్ రావిపూడి ప్రిన్స్ మహేష్‌బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా ప్రమోషన్ లో దర్శకుడు పూర్తిగా వెనుకపడ్డాడు. బన్నీ రెండు పాటలు విడుదల చేస్తే అవి రికార్డులు బద్దలు కొడుతున్నాయి. సరిలేరు నీకెవ్వరు పాటలు విడుదల చేద్దామంటే సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ వల్ల కావడం లేదని టాక్. దీంతో దీపావళీకి ఏదో పోస్టర్ లు విడుదల చేసి చేతులు దులుపుకున్నాడు దర్శకుడు అనీల్. మరి సంక్రాంతి బరిలో బన్నీని ఢీకొట్టేనా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.