విజ‌య్ ‘ విజిల్ ‘ 3 డేస్ క‌లెక్ష‌న్స్‌..

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇళ‌య ద‌ళ‌పతి విజయ్ నెమ్మదిగా తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ పెంచుకుంటున్నాడు. తాజాగా విజ‌య్ న‌టించిన బిగిల్ తెలుగులో విజిల్ పేరుతో రిలీజ్ అయ్యింది. అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో విజ‌య్‌కు జోడీగా న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించింది. ఈస్ట్‌కోస్ట్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ కోనేరు ఇక్క‌డ ఈ సినిమాను రిలీజ్ చేశారు.

ఏపీ, తెలంగాణ‌లో విజిల్ తొలి మూడు రోజుల‌కు రు 6.5 కోట్ల షేర్ రాబ‌ట్టింది. చాలా రోజుల త‌ర్వాత విజ‌య్ సినిమాల‌కు తెలుగులో మంచి ప్రారంభం ద‌క్కింది. కంప్లీట్ స్పోర్ట్స్ డ్రామాగా మాస్‌ను మెప్పించే క‌థ‌, క‌థ‌నాల‌తో తెర‌కెక్కిన ఈ సినిమాకు ఆ వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్సాన్స్ వ‌స్తోంది.

విజిల్ తెలుగు థియేట్రికల్ హక్కులు రూ .10 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక ఈ సినిమా ఫ‌స్ట్ వీక్ కంప్లీట్ అయ్యే స‌రికే బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి వ‌చ్చేయ‌నుంది. ఫ‌స్ట్ వీకెండ్ విజిల్ వ‌సూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – 1.92

సీడెడ్ -1.65

వైజాగ్ – 0.67

గుంటూరు – 0.81

ఈస్ట్ – 0.45

వెస్ట్ – 0.29

కృష్ణా – 0.44

నెల్లూరు – 0.27
————————————
ఏపీ + తెలంగాణ = 6.5 కోట్లు
————————————-

Share.