దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ ఏ కామెంట్ చేసినా దానికో అర్ధం ఉంటుంది. నా ఆలోచన అంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో జరిగే విషయాల పట్ల తన పంథా చెప్పుకొచ్చే తమ్మారెడ్డి భరద్వాజ మెగాస్టార్ మీద చేసే కామెంట్స్ మాత్రం హాట్ న్యూస్ గా మారుతాయి. చిరంజీవిని పొగుడుతూనే కామెంట్ చేయడం తమ్మారెడ్డికి అలవాటు. చిరుని ఏదైనా అంటే మెగా ఫ్యాన్స్ చేసే హంగామా గురించి కూడా సెటైరికల్ గా మాట్లాడుతాడు.
ఇదిలాఉంటే లేటెస్ట్ గా చిరంజీవి సైరా సక్సెస్ సందర్భంగా అటు ఏపి సిఎం వైఎస్ జగన్ ను కలిసి సందర్భంలో చిరు ఏదో పదవి ఆశించి అలా చేశారని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అవి చూసి తనకు కామెడీగా అనిపిస్తుందని అన్నారు. ఆయన సైరా సినిమా కోసం కలిస్తే పదవి కోసం కలిశారని రాశారు. అదీగాకుండా దాసరి ప్లేస్ ను రీ ప్లేస్ చేసేందుకే చిరు ఇలా అందరిని కలుస్తున్నారని అని కామెంట్స్ చేస్తున్నారు.
చిరంజీవి దాసరి కాలేడు.. కాని చిరంజీవి కావాలనుకుంటే పరిశ్రమ పెద్ద అవగలడు. ఆయనకు ఆ కెపాసిటీ ఉందని అంటున్నారు తమ్మారెడ్డి భరద్వాజ. పరిశ్రమలోని సమస్యల కోసం.. అన్ని సమస్యలను పరిష్కరించగల ఓ పెద్ద మనిషి అవసరం అయితే అది దాసరి ప్లేస్ ను రిప్లేస్ చేసినట్టు కాదు.. చిరంజీవి కావాలంటే అతనే పరిశ్రమ పెద్ద అవొచ్చని అన్నారు తమ్మారెడ్డి. చిరంజీవికి ఆ పొజిషన్ లో ఉండేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని కూడా అన్నారు.