తెలుగు గడ్డపై తమిళ హీరోల కొట్లాట..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో మన తెలుగు హీరోలకే కాదు తమిళ హీరోలకు క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. తమిళ హీరోలే అయినా రజినికాంత్, కమల్ హాసన్ లకు తెలుగులో కూడా మంచి పాపులారిటీ ఉంది. ఇక్కడ మన స్టార్ హీరోల రేంజ్ లో వారి సినిమాలు రిలీజ్ అవుతాయి. అయితే ఆ తర్వాత సూర్య, విక్రమ్ లు కూడా తెలుగు ప్రేక్షకులను అలరించారు. సూర్య సినిమాలు ఇప్పటికి తెలుగులో భారీ రేంజ్ లో రిలీజ్ అవుతాయి. అయితే చియాన్ విక్రం మాత్రం ఈమధ్య తెలుగులో మార్కెట్ కోల్పోయాడు.

ఇదిలాఉంటే సూర్య తర్వాత విశాల్, కార్తిలకు తెలుగులో బాగానే ఇమేజ్ ఏర్పడింది. విశాల్ ఎలాగు తెలుగు వాడు కాబట్టి తెలుగులో అతను మాట్లాడటం ఇక్కడ ఫ్యాన్స్ ను మెప్పించింది. సూర్య తమ్ముడిగా కార్తి కూడా తెలుగు స్పష్టంగా మాట్లాడుతూ ఇక్కడ ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు. అయితే కోలీవుడ్ లో రజిని రేంజ్ లో ఫాలోయింగ్ ఉన్న విజయ్ సినిమాలు తెలుగులో ఆశించిన ఫలితాలు ఇవ్వట్లేదు.

ఇక ఈ దీవాళికి తెలుగు స్ట్రైట్ సినిమాలేవి పోటీ పడట్లేదు. అందుకే రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు పోటీలో నిలుస్తున్నాయి. అక్టోబర్ 25న కార్తి ఖైది.. విజయ్ విజిల్ అటు తమిళంలో ఇటు తెలుగులో ఢీ కొడుతున్నాయి. తమిళంలో విజయ్ ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి బిగిల్ సినిమాకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. కాని తెలుగులో కార్తి ఖైది సినిమాకు మంచి పాపులారిటీ ఉంది. హీరోయిన్, సాంగ్స్, ఫైట్స్ ఇవేమి లేకుండా ఈ సినిమా వస్తుండటంతో తెలుగు ఆడియెన్స్ కు నచ్చేసింది. మరి తెలుగు గడ్డ మీద ఇద్దరు తమిళ హీరోల ఫైట్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Share.