టాలీవుడ్ క్రేజీ బ్యూటీకి ఛాన్సులు కరువయ్యాయి. మొదటి రెండు సినిమాలు ఫ్లాప్ అయినా సరే మూడవ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది ఈ చిన్నది. అయితే హిట్టు పడ్డా సరే అమ్మడికి మాత్రం లక్ కలిసి రావట్లేదు. ఇంతకీ ఎవరా బ్యూటీ అని ఆలోచిస్తున్నారు కదా ఆమె ఎవరో కాదు నిధి అగర్వాల్. అక్కినేని నాగ చైతన్యతో సవ్యసాచి, అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమాలు చేసిన నిధి అగర్వాల్ రాం తో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించింది.
పూరి జగన్నాథ్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా నిధి అగర్వాల్ కు సూపర్ క్రేజ్ దక్కించుకుంది. సినిమాలో నభా నటేష్ కూడా నటించి మెప్పించింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్న నిధి అగర్వాల్ ఆ తర్వాత తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు చేజిక్కించుకోలేదు. అందం, అభినయం సమపాళ్లలో ఉన్న ఈ అమ్మడికి ఛాన్సులు రావట్లేదు.
అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమాలో అంతగా రెచ్చిపోయినా సరే ఆమెకు అవకాశాలు రాకపోవడంతో ఇక మీదట మరింత అదరగొట్టేలా ప్లాన్ చేస్తుంది.ఇస్మార్ట్ హిట్ తో తెలుగులో మొదటి విజయాన్ని అందుకున్న నిధి అగర్వాల్ కచ్చితంగా రానున్న రోజుల్లో అదరగొట్టడం ఖాయమని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆమెకు రెండు మూడు సినిమాలు డిస్కషన్స్ లో ఉన్నాయి.