చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన బన్ని..!

Google+ Pinterest LinkedIn Tumblr +

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిపి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో మొదటి సాంగ్ సామజవరగమన సూపర్ హిట్ అయ్యింది. మరోసారి తమన్ తన మ్యూజిక్ టాలెంట్ ఏంటో మరోసారి తెలిసేలా చేశాడు.

ఇక ఈ సినిమా నుండి మరో సాంగ్ రిలీజ్ కాబోతుంది. మొదటి సాంగ్ క్లాస్ బీట్ తో ప్రేక్షకుల మనసు గెలిచిన తమన్ ఇప్పుడు మాస్ ఆడియెన్స్ కోసం మరో క్రేజీ బీట్ ఇస్తున్నాడు. సినిమాలో రాములో రాములా సాంగ్ ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ అంటూ ఎనౌన్స్ చేశారు. అల వైకుంఠపురములో నుండి వస్తున్న రెండో సాంగ్ కాబట్టి ఈ సాంగ్ కోసం ఆడియెన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూశారు.

అయితే ఏమైందో ఏమో కాని సడెన్ గా ఆ సాంగ్ రిలీజ్ వాయిదా వేశారు. ఈరోజు అనుకున్న సాంగ్ కాస్త రేపటికి వాయిదా వేశారు. మరి మాస్ బీట్ కు తుది మెరుగులు ఏదైనా దిద్దుతున్నారా లేక మరే కారణమో కాని సినిమాలో ఈ సాంగ్ కూడా చాలా స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. తన సినిమాల సాంగ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే బన్ని అల వైకుంఠపురములో ఆల్బం అదరగొట్టనున్నాడని తెలుస్తుంది.

Share.