రాజుగారి గది ఏ ముహూర్తాన మెదలు పెట్టాడో కాని ఓంకార్ ఆ సినిమాకు వరుసపెట్టి సీక్వెల్స్ కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. రాజుగారి గది హిట్ అవ్వడంతో వెంటనే నాగార్జున, సమంత, సీరత్ కపూర్ లాంటి స్టార్ కాస్టింగ్‌తో చేసిన రాజుగారి గది 2 అందుకోలేకపోయింది. ఇప్పుడు మరోసారి హర్రర్, కామెడీ మిక్స్ చేసిన ఓంకార్ తెరకెక్కించిన రాజుగారి గది 3పై రిలీజ్‌కు ముందే మంచి అంచనాలు ఉన్నాయి.
ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అశ్విన్ హీరోగా ఓం కార్ దర్శకత్వంలో అవికా గోర్ హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజుగారి గది మొదటి రోజు 1.20 కోట్ల షేర్ సాధించింది. విచిత్రం ఏంటంటే తొలి రెండు రోజుల కంటూ మూడో రోజు ఈ సినిమాకు ఎక్కువ వసూళ్లు వచ్చాయి.
మూడో రోజు ఈ సినిమా ఏకంగా తొలి రెండు రోజుల కంటే ఎక్కువుగా రు 1.40 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా రు 3.6 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో 70 శాతం రికవరీ సాధించింది.
‘ రాజుగారి గది 3 ‘ 3 డేస్ ఏరియా వైజ్ షేర్ (రూ.లక్షల్లో) :
నిజాం – 1.25
సీడెడ్ – 0.6
నెల్లూరు – 0.13
కృష్ణ – 0.26
గుంటూరు – 0.31
వైజాగ్ – 0.48
ఈస్ట్ – 0.26
వెస్ట్ – 0.19
——————————————–
ఏపీ & తెలంగాణ షేర్ = 3.48 కోట్లు
——————————————–
రెస్టాఫ్ వరల్డ్ – 0.12
టోటల్ వరల్డ్ వైడ్ షేర్ = 3.6 కోట్లు