బాహుబలి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సీరిస్ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ లాంటి ప్రెస్టేజియస్ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. టాలీవుడ్‌లో ఇద్దరు యంగ్ క్రేజీ హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇక రాజమౌళి ముందుగానే వచ్చే యేడాది జూలై 30న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాలో అలియా భట్ మరియు ఎమ్మా రాబర్ట్స్ హీరోయిన్లు. ఇక ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఇద్దరూ గాయపడడంతో షూటింగ్ ఇప్పటికే మూడు నెలలు లేట్ అయ్యింది.
దీంతో ఆర్ ఆర్ ఆర్ వచ్చే యేడాది రిలీజ్ కాదని… 2012కు వెళ్లిపోతుందని అందరూ ఊహించుకుంటున్నారు. దీనిపై లేటెస్ట్‌గా ఈ సినిమా వర్గాల నుంచి ఓ క్లారిటీ వచ్చింది. ఈ సినిమాను ముందుగా అనుకున్నట్టుగా వచ్చే యేడాది జూలై 30న రిలీజ్ చేయకపోయినా…. వచ్చే యేడాది చివర్లో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఇక షూటింగ్ ఓ కొలిక్కి వచ్చాక ఈ సినిమా దర్శకుడు రాజమౌళి రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.