మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు నమోదు చేస్తూ దూసుకెళుతోన్న సంగతి తెలిసిందే . చిరు కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిరంజీవి ఇప్పటికే తెలంగాణ గవర్నర్, ఏపీ సీఎం ఇలా ప్రతి ఒక్కరిని కలిసి సినిమా చూడాలని విజ్ఞప్తి చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఇక చిరంజీవి గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సైతం కలవనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా బయ్యర్లుకు కొత్త చిక్కు వచ్చి పడింది అదే జీఎస్టీ . కేంద్రప్రభుత్వం అన్నింటి ఫై జీఎస్టీ వేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా జీఎస్టీ కట్టాలి. ఈ నేపథ్యంలో సైరా థియేటర్స్పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు.
ఈస్ట్ గోదావరి జిల్లాలోని పలు థియేటర్లలో జీఎస్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారట. అక్కడ లెక్కలు అన్ని సరిగా ఉన్నాయా లేవా అనే విషయాన్ని పరిశీలించారని తెలుస్తోంది. కేవలం ఇక్కడే కాదు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ అన్నింట్లో దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్‌కు రావాల్సి ఉన్న టైంలో సైరా టార్గెట్‌గా జరుగుతోన్న ఈ దాడుల నేపథ్యంలో సైరా అభిమానులు కాస్త ఆందోళనతో ఉన్నారు.