కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కెరీర్ పరంగా వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇళయ దళపతిగా దూసుకుపోతోన్న విజయ్ ప్రస్తుతం ఆట్లీ దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న బిగిల్ (తెలుగులో విజిల్) సినిమాలో నటిస్తున్నాడు దీపావళికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌కు రెడీ అవుతోన్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి అసాధారణమైన స్పందన వచ్చింది.
ఇక బిగిల్ తెలుగులో విజిల్ పేరుతో దీపావళికే వస్తోంది. నయనతార హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా రు.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. బిగిల్ థియేటర్ మరియు నాన్-థియేట్రికల్ హక్కులతో సహా రూ .222 కోట్ల వరల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక ఏఆర్.రెహ్మన్ కంపోజ్ చేసిన ఆల్బమ్‌కు అదిరిపోయే రెస్సాన్స్ వస్తోంది.
బిగిల్ (విజిల్) ప్రి రిలీజ్ బిజినెస్ (రూ.కోట్లలో) :
తమిళనాడు – 85
కేరళ & కర్ణాటక – 16
తెలుగు – 9
ఓవర్సీస్ – 28
థియేట్రికల్ – 140
నాన్-థియేట్రికల్ – 82
—————————————————–
టోటల్ ప్రి రిలీజ్ బిజినెస్ = రూ .222 కోట్లు
—————————————————–