తెలుగు సినిమాలకు సంక్రాంతి – దసరా సీజన్ల తర్వాత చెప్పుకోదగ్గ సీజన్ క్రిస్మస్. గత కొన్నేళ్లుగా సంక్రాంతికి వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇక ఈ సీజన్ అక్కినేని ఫ్యామిలీకి బాగా కలిసొస్తుంటుంది. నాగార్జున మన్మథుడు, నేనున్నాను, డాన్, మాస్ ఇలా చెప్పుకుంటూ పోతే నాగ్ క్రిస్మస్కు వచ్చి ఎన్నో హిట్లు కొట్టాడు. ఈ సంవత్సరం మాత్రం అక్కినేని ఫ్యామిలీ నుంచి ఏ హీరో సినిమా కూడా క్రిస్మస్కు రావడం లేదు.
ఈ యేడాది క్రిస్మస్కు ఖర్చీఫ్ వేసిన సినిమాల్లో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ‘డిస్కో రాజా’ – నితిన్ హీరోగా ‘భీష్మ’ – సాయిధరమ్ తేజ్ హీరోగా ‘ప్రతిరోజూ పండుగే’ సినిమాలు లైన్లో ఉన్నాయి. ట్విస్ట్ ఏంటంటే ఈ ముగ్గురు హీరోలకు కొన్నేళ్లుగా సరైన హిట్ లేదు. సాయికి చిత్రలహరి లాంటి సినిమా వస్తేనే హిట్ అని చెప్పుకునే రేంజ్‌కు పడిపోయాడు.
అటు రవితేజ వరుస ప్లాపులతో విలవిల్లాడుతున్నాడు. ఇప్పటికే హ్యాట్రిక్ ప్లాపులను దాటేశాడు మరోవైపు నితిన్‌ది కూడా సేమ్ టు సేమ్ పొజిషన్. మరి ఈ క్రిస్మస్ వాళ్ళకి హిట్ ఇస్తుందో… లేదో… చూడాలి. ఇక ఈ మూడు సినిమాలతో పాటు స్విటీ బ్యూటీ అనుష్క ప్రధాన రోల్లో నటిస్తోన్న నిశ్శబ్దం కూడా ఖర్చీఫ్ వేసుకుని ఉంది.
ఇక వెంకీ – నాగచైతన్య వెంకీ మామ సినిమాకు సరైన డేట్ లాక్ కాకపోతే సంక్రాంతికి వస్తుందని అంటున్నారు. బాలకృష్ణ – కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు సంక్రాంతికి వచ్చే ఛాన్స్ లేదు. సంక్రాంతికి ఇప్పటికే చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి. దీంతో ఈ సినిమాను సైతం క్రిస్మస్కే రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. మరి వీటిల్లో ఏది హిట్.. ఏది ఫట్ అవుతుందో ? చూడాలి.