ఏడు చేపల కథ.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపించిన పేరు ఇది. తొలి టీజర్ విడుదలయ్యేంత వరకు ఈ సినిమా ఒకటి వస్తుందని ఎవరికీ తెలియదు కానీ వచ్చిన తర్వాత మాత్రం రచ్చ చేసింది. ఆ టీజర్‌కు ఏకంగా కోటి వ్యూస్ రావడంతో ఈ సినిమా పేరు ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు ట్రైలర్ వచ్చింది. ఇక ట్రైలర్ చూస్తే అడల్డ్ కామెడీ డోస్ మామూలుగా లేదు.
ఈ మధ్య కాలంలో వచ్చిన అడల్ట్ సినిమాలు అన్నింటికి తాతలా ఉంది ఏడు చేపల కథ ట్రైలర్. ట్రైలర్లోనూ ఇంత చూపించారు అంటే ఇక సినిమాలో ఏ రేంజులో చూపించారో ఊహించుకోవచ్చు. పక్కా ఆ టార్గెట్ ఆడియెన్స్‌ను దృష్టిలో ఉంచుకునే సినిమా తీశారన్నది అర్థమవుతోంది. స్యామ్ జే చైతన్య తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం తెలుగు సినిమా అడల్ట్ స్థాయిని మరో రేంజ్‌కు తీసుకెళ్లింది.
బూతు సినిమాలు కూడా బిత్తరపోయేలా ట్రైలర్ కట్ చేసాడు దర్శకుడు. ఇక భాను శ్రీ కూడా మరో స్థాయిలో రెచ్చిపోయింది. ఇది చూసిన తర్వాత అసలు థియేటర్స్‌లో విడుదల అవుతుందా అనేది కూడా అనుమానమే. మరి ఈ ఏడు చేపల కథ ట్రైలర్ చూస్తే వీళ్లు ఎంతలా రెచ్చిపోయారో తెలుస్తోంది.