బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ బోల్డ్ గా నటించడమే కాదు బోల్డ్ స్టేట్ మెంట్స్ ఇవ్వడంలో కూడా ఎలాంటి మొహమాటపడదు. ఆమె చేస్తున్న సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంటున్నాయి. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా కంగనా సినిమాలు ఉంటాయి. అందుకే ఆమెకు అక్కడ సూపర్ క్రేజ్ ఉంది. సినిమాలు కూడా సక్సెస్ అవడంతో ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి.
ఇక రీసెంట్ గా ఇండియా టుడే మైండ్ రాక్స్ 2019 ఈవెంట్ లో పాల్గొన్న కంగనా సెక్స్ మీద ఓ క్రేజీ స్టేట్ మెంట్ ఇచ్చేసింది. సెక్స్ కోరికలు వచ్చినప్పుడు సెక్స్ చేసేయండి అది మనసులో అణచుకోవడం వల్ల నష్టాలు కలుగుతాయని అంటుంది కంగనా. ఎవరితో అయినా సెక్స్ చేయాలని వెంటనే చేసేయండి అంటుంది. కంగనా మాటలు ఓ వర్గం వారు తప్పు పడుతున్నారు.
అవతల వారి ప్రమేయం లేకుండా సెక్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు. అయితే ఆమె ప్రేమించిన వారితోనే పెళ్లికి ముందు సెక్స్ తప్పేం కాదని అంటుంది. ఆచారాలు, సంప్రదాయాలు పక్కనపెట్టి శృంగారాన్ని ఎంజాయ్ చెయ్యండంటూ కంగనా చెప్పుకొచ్చింది. మరి ఈ అమ్మడు ఈ కామెంట్స్ కు ఏవిధమైన రెస్పాన్స్ వస్తుందో చూడాలి.