బాహుబలి సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది మిల్కిబ్యూటీ.. బాహుబలిలో కత్తిపట్టి పోరు చేసినా.. వీరనారిలో కథనరంగంలోకి దూకినా.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో చేసిన రోమాన్స్‌తో మిల్కిబ్యూటీ అందరిని మంత్రముగ్ధులను చేసింది. ఇప్పుడు సైరా సినిమాలోనూ మరోమారు కథనరంగంలోకి దూకి కరవాలం చేబట్టి తనదైన శైలీలో నటించి మెప్పించింది. సైరాలో తన నటనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటుంది తమన్నా.
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమా భారీ విజయాన్ని సాధించింది. సైరా విజయంతో తన పాత్రకి మంచి పేరు రావడంతో మిల్కిబ్యూటీ తమన్నా ఫుల్ ఖుషీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తమన్నా తమిళంలో చేసిన పెట్రోమ్యాక్స్ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈసినిమా కూడా తమిళంలో పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న తమన్నాకు ఇప్పుడు ఓ బెంగ పట్టుకుందట..
తమన్నా తనకు ఆయన కావాలని అంటుందట.. ఓ టాప్ రేంజ్‌లో ఉన్న తమన్నా కోసం అవకాశాలు వెతుక్కుంటు వస్తుండగా, ఆమే మాత్రం ఆ హీరోనే కావాలంటూ తెగ మారాం చేస్తుందట. ఇంతకు తమన్నా కోరుకుంటుంది ఎవరినో తెలుసా.. తమిళస్టార్ హీర్ విజయ్ కావాలంటుంది.. ఇంతకు విజయ్‌ను ఎందుకు కోరుకుంటుందనుకుంటున్నారు.. అతడితో సుర సినిమాలో నటించిందట.. అప్పుడు ఆయనతో సరిగా మాట్లాడలేదట.. అయితే ఇప్పుడు మరోమారు ఆయనతో నటించాలని తన కోరికను బయటపెట్టింది. అంటే ఆయనతో మరోమారు నటించాలని ఉందట ఈ అమ్మడికి..