‘ సైరా ‘ 10 డేస్ క‌లెక్ష‌న్లు…. బ్రేక్ ఈవెన్ అవుతుందా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ సైరా నరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద విజ‌య‌వంతంగా రెండో వారంలో కూడా దూసుకుపోతోంది. అక్టోబ‌ర్ 2వ తేదీన మొత్తం ఐదు భాష‌ల్లో రిలీజ్ అయిన సైరా రెండు తెలుగు రాష్ట్రాలు మిన‌హా మిగిలిన చోట్ల ఆశించినంత‌గా పెర్పామ్ చేయ‌లేదు. అటు బాలీవుడ్‌లోనూ, ఇటు కోలీవుడ్‌లోనూ, కేర‌ళ‌లోనూ సైరా ప్లాప్ అయ్యింది.

ఇక ఓవ‌ర్సీస్‌లో మొత్తం నాలుగు మిలియ‌న్ డాల‌ర్ల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన సైరా రెండు మిలియ‌న్ల గ్రాస్ సాధించేందుకే ఆప‌సోపాలు ప‌డింది. అక్క‌డ కూడా ఈ సినిమా ప్లాప్ అయిన‌ట్టే అని ట్రేడ్ వర్గాలు తేల్చేశాయి. ఇక నైజాంతో పాటు ఏపీలో మాత్రం చెప్పుకోద‌గ్గ వ‌సూళ్లు సాధిస్తోంది.

సైరా 10 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.94.72 కోట్లు కొల్లగొట్టింది. ఏరియాల వారీగా ఈ సినిమా 10 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి. అయితే ఇక్క‌డ ఈ సినిమాకు మొత్తం రు.106 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఈ సినిమాకు ఇక్క‌డ బ్రేక్ ఈవెన్ రావాలంటే మ‌రో రు.12 కోట్లు రావాల్సి ఉంది.

ఏరియా వైజ్ క‌లెక్ష‌న్లు (రూ.కోట్ల‌లో) :

నైజాం – 28.60

సీడెడ్ – 17.09

నెల్లూరు – 4.18

కృష్ణా – 6.09

గుంటూరు – 9.02

వైజాగ్ – 14.42

ఈస్ట్‌ – 8.45

వెస్ట్‌ – 6.07
————————————
ఏపీ+తెలంగాణ – 94.72 కోట్లు
————————————

Share.