ఆ యాక్ష‌న్ హీరో కేరీర్ ముగిసిన‌ట్లేనా.. !

Google+ Pinterest LinkedIn Tumblr +

సందేశాత్మ‌క చిత్రాల‌ను నిర్మించి, న‌టించిన హీరో కొడుకు ఆయ‌న‌. తండ్రి సందేశాత్మ‌క చిత్రాలు తీస్తే.. కొడుకు మాత్రం యాక్ష‌న్ చిత్రాల‌ను న‌మ్మ‌కున్నాడు.. ముందుగా హీరోగా ప‌రిచ‌యం అయ్యి.. త‌రువాత విల‌న్ వేషాలు వేసి మ‌ళ్ళీ హీరోగా మారి త‌న‌దైన ముద్ర వేసుకుని హీరోగా నిల‌దొక్కున్నాడు. సిని ప‌రిశ్ర‌మ‌లో యాక్ష‌న్ హీరోగా నిల‌దొక్కుంటున్న త‌రుణంలో వ‌రుస ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రిస్తున్నాయి..

ఇప్పుడు ఈ యాక్ష‌న్ హీరో న‌టించిన చిత్రాలు డిజాస్ట‌ర్ కావ‌డంతో ఏమీ చేయాలో దిక్కుతోచ‌ని స్థితిలోకి నెట్ట‌బ‌డ్డాడు. ఇటీవ‌ల సైరా చిత్రంతో పోటీ మ‌రో చిత్రం విడుద‌ల చేసి ఇప్పుడు కేరీర్‌కే ముగింపు ప‌లికే ద‌శ‌కు చేరుకున్నాడు.. ఇంత‌కు యాక్ష‌న్ హీరో ఎవ్వ‌రో మీకు ఇప్ప‌టికే అర్థ‌మ‌యి ఉంటుంది.. అత‌డెవ‌రో కాదు.. ఆయ‌నే గోపీచంద్‌. గోపీచంద్ వ‌రుస‌గా న‌టించిన పంతం, ఆక్సీజ‌న్‌తో పాటు వ‌రుస‌గా నాలుగు చిత్రాలు బాక్సాఫీసు వద్ద బొల్తాకొట్టాయి.

ఇటీవ‌ల గోపీచంద్ చాణ‌క్య‌తో మరోమారు త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. స‌మ‌యం కానీ స‌మ‌యంలో వ‌చ్చిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీసు వ‌ద్ద భారీగా దెబ్బ‌తిన్న‌ది. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సైరా చిత్రం విడుద‌ల స‌మ‌యంలోనే ఈ సినిమాను విడుద‌ల చేయ‌డంతో సైరా ముందు చాణ‌క్య బొక్క‌బోర్లా ప‌డ్డాడు. దీంతో ఇక గోపీచంద్ కేరీర్ ముగిసిన‌ట్లే అని చ‌ర్చ‌లు ఫిలింన‌గ‌ర్‌లో జోరుగా వినిపిస్తున్నాయి..

Share.