కమల్‌హాసన్ కుమార్తె, హీరోయిన్ శృతిహసన్ మూడేళ్ల క్రితం వరకు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగొందారు. తమిళ్‌తో పాటు తెలుగులోనూ వరుసగా స్టార్ హీరోలతో అవకాశాల మీద అవకాశాలు సొంతం చేసుకుని హిట్లు కొట్టారు. ఇక్కడ ఫామ్‌లో ఉండగానే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ నుంచి మటు మాయం అయ్యారు. తర్వాత ఆమె ఫిజిక్ కూడా బాగా తేడా కొట్టేయడంతో ఆమెకు ఎవ్వరూ అవకాశాలు ఇవ్వలేదు. ఆ తర్వాత ఆమె ఫేడవుట్ హీరోయిన్ అయిపోయారు.
ఫుల్ ఫామ్‌లో ఉండగానే ఆమె తన కెరీర్‌ను చేజేతులా కాలదన్నుకున్నారు. ఆమె ప్రేమాయణం కూడా ఆమె కెరీర్ పనతానికి ఓ కారణం. ఇక తాజాగా ఆమె ఓ టీవీ షోలో మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను తాగుడుకు బానిసైనట్టు చెప్పారు. అందువల్లే కొద్దికాలం సినిమాలకు కూడా దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. రెండేళ్లు పాటు విపరీతంగా విస్కీ తాగడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యానని.. దీని నుంచి కోలుకునేందుకు చాలా టైం పట్టిందని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇక తన బాయ్ ఫ్రెండ్ మైఖేల్ నుంచి విడిపోవడంపైనా ఆమె స్పందించారు. మైఖేల్‌తో బంధం ఒక మంచి అనుభవం అని వ్యాఖ్యానించారు. ఇద్దరం ఓ అభిప్రాయానికి వచ్చే విడిపోయామని… ప్రస్తుతం తన దృష్టంతా సినిమాలపైనే ఉందని చెప్పారు. ఇక తాను ఓ గొప్ప ప్రేమికుడి కోసం వెయిటింగ్‌లో ఉన్నానని… అలాంటి ప్రేమికుడు ఎదురైనప్పుడు ఆ విషయాన్ని అందరికీ చెబుతానన్నారు. తాను ప్రశాంతంగా ఉంటానని… చాలా అమాయకురాలిని అని చెప్పారు శృతి.