ఏ ఇండస్ట్రీలో అయినా ఒక హీరో లేదా డైరెక్టర్ రెమ్యూనరేషన్ ఎప్పుడు వారి సినిమాలు చేసే బిజినెస్ పైనే ఆధారపడి ఉంటుంది. హీరో మార్కెట్‌ను మించి రెమ్యునరేషన్ ఎప్పుడో గాని ఇవ్వరు. లేదా ఖచ్చితంగా ఆ హీరోతోనే సినిమా చేయాలనుకునే నిర్మాతలు మాత్రం ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చే రిస్క్ చేస్తారు. ఇక ప్రస్తుతం యువరత్న నందమూరి బాలకృష్ణ తన కొత్త సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ విషయంలో వినిపిస్తున్న టాక్ అందరికీ షాక్ ఇస్తోంది.
బాలయ్య ప్రస్తుతం కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో నటిస్తోన్న సినిమా క్రిస్మస్కు రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు రూలర్ అనే వర్కింగ్ టైటిల్ పరిశీలిస్తున్నారు. సీ కళ్యాణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా కోసం బాలయ్యకు రు.10 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. వాస్తవంగా బాలయ్యకు రు.6-7 కోట్లకు మించి రెమ్యునరేషన్ ఇవ్వడం లేదు.
బాలయ్య ఇటీవల చేసిన సినిమాలు కూడా పెద్దగా కమర్షియల్‌గా సక్సెస్ అవ్వలేదు. బాలయ్య – కేఎస్.రవికుమార్ కాంబోలో వచ్చిన జై సింహా మాత్రం బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇప్పుడు అదే కాంబో రిపీట్ అవ్వడంతో ఈ సినిమాకు కాస్త ఎక్కువగానే రెమ్యునరేషన్ ఇచ్చారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో వాస్తవ.. అవాస్తవాలు ఎంతో తెలియాలి.
ఈ సినిమా కోసం బాలయ్య కొత్త గెటప్ తో..ఐరన్ మ్యాన్ స్టైల్ గడ్డంతో అందరినీ ఆకర్షించిన బాలయ్య ఈ సినిమాలో సోనాల్ చౌహాన్.. వేదికలతో రోమాన్స్ చేస్తున్నారు.