భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరుల్లో మొదటి తరం యోధుడి జీవిత కథతో తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రం. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకం తెరకెక్కించారు దర్శకుడు సురేందర్ రెడ్డి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సైరా చిత్రంను తెలంగాణ గవర్నర్ తమిళసై వీక్షించారు. ప్రసాద్ లాబ్స్ లో మెగాస్టార్ చిరంజీవితో పాటుగా, చిత్ర యూనిట్లోని ప్రముఖులు సినిమాను చూసారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సైరా చిత్రం గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ గవర్నర్ తమిళ సైని రాజ్భవన్లో కలిసి సైరా చిత్రం గురించి వివరించారు. స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన ఈచిత్రాన్ని చూడాలని గవర్నర్ ను కోరారు మెగాస్టార్.
మెగాస్టార్ కోరిక మేరకు గవర్నర్ తమిళ సై రాత్రి ప్రసాద్ లాబ్లో ప్రత్యేక షో వీక్షించారు. గవర్నర్ కోసం మెగాస్టార్ చిరంజీవి తమిళ వెర్షన్లో చిత్ర ప్రదర్శన చేయించారు. ఈ సినిమాను వీక్షించిన గవర్నర్ సినిమా చూసిన అనంతరం మెగాస్టార్తోనూ, కుటుంబ సభ్యులతోనూ ఎంతో సంతోషంగా ముచ్చటించారు. తమిళ సై స్వతహాగా మెగాస్టార్ అభిమానట. ఆమే మెగాస్టార్ నటించిన సినిమాలు అనేకం చూసిందట. ఈవిషయాన్ని మెగాస్టార్ గవర్నర్ను కలిసిన సందర్భంలో చెప్పారు.