హృతిక్ రోషన్ – టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ లో నిన్న విడుదలైన వార్ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ టాప్ లేపింది. మొదటి రోజే దాదాపు 50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో అల్ టైం హయ్యస్ట్ గ్రాస్పింగ్ రికార్డు దిశగా దూసుకుపోతోంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ మూవీ దేశవ్యాప్తంగా ట్రెమండస్ రెస్పాన్స్ అందుకుంది.
ఇండియన్ ఏజెంట్స్ అయిన ఇద్దరు హీరోల మధ్య నడిచే యాక్షన్ వార్ డ్రామాగా ఇది ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇటీవల కమర్షియల్ మూవీస్ వదిలిన బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ చాలా రోజుల తర్వాత తన రేంజ్ కమర్షియల్ హిట్ కోసం ప్రయత్నాలు చేశాడు. వార్ సినిమా హృతిక్‌కు ఆ కొరత తీర్చేసినట్టే కనపడుతోంది.
ఇక వార్ బాలీవుడ్‌లో తొలి రోజే ఇప్పటివరకు రు. 52 కోట్ల మొదటిరోజు గ్రాస్ కలెక్షన్స్ తో అమిర్ ఖాన్ నటించిన థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్రం ఉంది. వార్ మూవీ ఫైనల్ కలెక్షన్స్ రిపోర్ట్ వచ్చేసరికి ఈ రికార్డు ని అధిగమించే అవకాశం కలదు. యాష్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ మూవీలో హీరోయిన్ గా వాణి కపూర్ నటించారు.