‘ సైరా ‘ ఫ‌స్ట్ డే ఏపీ & తెలంగాణ క‌లెక్ష‌న్స్‌..

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి సైరా ఏపీ, తెలంగాణ‌లో తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా దుమ్ము రేపింది. తొలి తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు సినిమా కావ‌డంతో పాటు చిరు కెరీర్‌లో తొలిసారిగా ఈ త‌ర‌హా పాత్ర చేయ‌డంతో సైరాపై ముందు నుంచే మంచి అంచ‌నాలు ఉన్నాయి.

ఇత‌ర భాష‌ల‌కు చెంది న‌టీన‌టులు చేయ‌డంతో పాటు పాన్ ఇండియా సినిమాగా భారీ ఎత్తున ప్ర‌మోష‌న్లు చేశారు. సినిమాలో కొన్ని త‌ప్పులు ఉన్నా… క‌థ వ‌క్రీక‌రించార‌ని క్రిటిక్స్ చెప్పినా… స్లో నెరేష‌న్ ఇవ‌న్నీ ఏవీ సైరా క‌లెక్ష‌న్ల‌ను ఆప‌లేక‌పోయాయి. మ‌రోసారి ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో ఈ వ‌య‌స్సులో కూడా చిరు తానేంటో ఫ్రూవ్ చేసుకున్నాడు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో సైరా తొలి రోజు రు 38.73 కోట్ల షేర్ రాబ‌ట్టింది. బాహుబ‌లి 2 త‌ర్వాత ఇదే ఆల్ టైం సెకండ్ రికార్డుగా నిలిచింది.

సైరా ఫ‌స్ట్ డే ఏరియా వైజ్ షేర్ (రూ.కోట్ల‌లో ) :

నైజాం – 8.10

సీడెడ్ – 5.90

నెల్లూరు – 2.09

కృష్ణా – 3.03

గుంటూరు – 5.06

వైజాగ్ – 4.72

ఈస్ట్ – 5.34

వెస్ట్ – 4.50

—————————————
ఏపీ + తెలంగాణ = 38.73 కోట్లు
—————————————

ఓవ‌రాల్‌గా ఆల్ టైం సెకండ్ రికార్డ్… ఫ‌స్ట్ బాహుబ‌లి 2 = 42.76 కోట్లు

Share.