‘ సైరా ‘ కు శాండ‌ల్‌వుడ్‌లో నిర‌స‌న సెగ‌లు

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం సైరా నరసింహారెడ్డి తెలుగు రాష్ట్రాలు.. ప్రపంచ దేశాలు సహా ఇరుగు పొరుగు భాషల్లోనూ భారీగా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే శాండ‌ల్‌వుడ్‌లో ఈ సినిమాకు నిర‌స‌న సెగ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అక్క‌డ తొలి రోజు ఉద‌యం 3 గంట‌ల‌కే షోలు వేయ‌డంతో పాటు క‌ర్నాట‌క‌లోని ఇత‌ర న‌గ‌రాల్లో సైతం షోలు వేయ‌డంతో అక్క‌డ ఇండ‌స్ట్రీ జ‌నాలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

అస‌లు క‌ర్నాట‌క‌లో ఇత‌ర భాష‌ల సినిమాల‌ను రిలీజ్ చేసే విష‌యంలో చాలా రూల్స్ ఉన్నాయి. బెంగళూరు సహా కర్ణాటకలోని కొన్ని ప్రధాన నగరాల్లో పరభాషా సినిమాలను తెల్లవారు జామున థియేటర్లో ప్రదర్శించడంపై నిషేధం ఉంది. ఉదయం 8 గంటల తరువాతే ఆయా సినిమాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. సైరాకు మాత్రం బుధ‌వారం తెల్లవారు ఝామున 3.30కే బెంగళూరులో 42 స్పెషల్ షోలు వేశారట.

తెలుగు వాళ్లు ఎక్కువుగా ఉండే రాయ‌చూర్‌, బ‌ళ్లారి న‌గ‌రాల్లోనూ ఇదే ఇలాగే ఉద‌యం షోలు వేయ‌డంతో క‌న్న‌డ ఇండ‌స్ట్రీ భ‌గ్గుమంటోంది. ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చిన కన్నడ ఫిలింఛాంబర్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతోంది. ఇక భారతదేశంలోనే నాశిరకం సినిమాలు తీసే పరిశ్రమగా కన్నడ ఇండస్ట్రీ లోగుట్టు గురించి ఇప్పటికే బోలెడంత చర్చ సాగుతోంది.

ఇలా పరభాషా చిత్రాల్ని కట్టడి చేయడం ద్వారా ఆ పరిశ్రమ ఎంతవరకూ ఎదుగుతుంది ? అన్నది కూడా ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఈ సంగ‌తి ఎలా ఉన్నా ? సైరా విష‌యంలో ఇప్పుడు క‌న్న‌డ నాట తీవ్ర‌మైన నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. త‌మ రూల్స్ బ్రేక్ చేయ‌డం ఏంట‌న్న ప్ర‌శ్న‌లు అక్క‌డ భారీగా వ‌స్తున్నాయి.

Share.