టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్య పెద్దగా ఫాంలో లేనట్టు కనిపిస్తున్నా అమ్మడి ఫోకస్ మొత్తం బాలీవుడ్ మీద పెట్టినట్టు తెలుస్తుంది. సౌత్ లో స్టార్ ఇమేజ్ వచ్చినా సరే హీరోయిన్స్ కు బాలీవుడ్ లో క్లిక్ అవ్వాలన్న కోరిక ఉంటుంది. రీసెంట్ గా రకుల్ హిందిలో నటించిన దే దే ప్యార్ దే సినిమా సూపర్ హిట్ అయ్యింది. అందుకే బాలీవుడ్ నుండి ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.
అయితే ఛాన్సులు వస్తున్నా సరే తన ఫాలోవర్స్ ను అలరించేందుకు హాట్ పిక్స్ షేర్ చేస్తుంది రకుల్. లేటెస్ట్ గా రెడ్ గౌన్ లో హాట్ లుక్స్ తో అదరగొట్టేస్తుంది రకుల్. గ్లామర్ షోకి తను ఏమాత్రం అడ్డు చెప్పనని హింట్ ఇస్తూ రకుల్ చేస్తున్న ఈ హాట్ షో ఆమె ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంది. రెడ్ చిల్లి డ్రెస్ లో రెచ్చగొట్టే చూపులతో రకుల్ దుమ్ముదులిపేస్తుందని చెప్పొచ్చు.
ఇక ఈమధ్య రెండు మూడు తెలుగు సినిమా ఛాన్సులు ఇలా వచ్చి అలా మిస్సయ్యాయి. బంగార్రాజు సినిమాలో నాగ చైతన్య సరసన రకుల్ నటించాల్సి ఉంది కాని చైతుకి జోడీగా రకుల్ ప్లేస్ లో సమంతనే రీప్లేస్ చేశారు. తమిళంలో కూడా రకుల్ కు పెద్దగా అవకాశాలు రావట్లేదు. అందుకే రకుల్ బాలీవుడ్ ఆడియెన్స్ ను బుట్టలో వేసుకునే ప్లాన్ లో ఉంది. ఈ స్కిన్ షో కూడా అక్కడ దర్శక నిర్మాతలను ఎట్రాక్ట్ చేసేందుకే అంటున్నారు.