ఫ్యాన్స్‌ను టెన్ష‌న్ పెడుతోన్న మ‌హేష్‌..

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రస్తుతం ఇదే మాట ఫిలిం సర్కిల్లో వినిపిస్తుంది. మహర్షి తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరూ. వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతోన్న టాలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో రష్మిక మంద‌న్న హీరోయిన్ గా తెరకెక్కుస్తున్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా న‌డుస్తోంది. ఈ సినిమాను జ‌న‌వ‌రి 11న సంక్రాంతి బరిలో తీసుకురావాలని ముందు నుండి ప్లాన్ చేసుకొని.. దాని ప్రకారమే షూటింగ్ పూర్తి చేస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈ సినిమాను ముందుగా అనుకున్న‌ట్టుగా 11న కాకుండా 14న రిలీజ్ చేయాల‌ని భావిస్తున్న‌ట్టు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇదే మ‌హేష్ ఫ్యాన్స్‌ను టెన్ష‌న్ పెట్టేస్తోంది. వ‌చ్చే సంక్రాంతి బరిలో భారీ చిత్రాలే రిలీజ్ కాబోతున్నాయి. రజనీ నటిస్తున్న దర్బార్ చిత్రం సంక్రాంతి 10 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అలాగే అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠ‌పురంలో 12న వ‌స్తోంది.

ఇక జ‌న‌వ‌రి 11 లేదా 12 డేట్స్‌ మాత్ర‌మే ఉన్నాయి. ఈ రెండు డేట్ల‌లో త‌మ సినిమా రిలీజ్ చేసేందుకు మ‌హేష్ సుముఖంగా లేన‌ట్టు తెలుస్తోంది. 14న రిలీజ్ చేస్తే బెటర్ అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలా అయితే ముందు వచ్చిన సినిమాల ఓపెనింగ్ హడావుడి అయిపోతుంది. 14 ఫ్రెష్ డేట్ గా వుంటుంది.

అయితే సినిమా కొన్న బ‌య్య‌ర్ల ఆలోచ‌న మ‌రోలా ఉంది. పండుగ మూడు రోజులు ఎలాగూ క్రౌడ్ ఉంటుంది. ముందుగా వ‌స్తే ఆ మూడు రోజుల‌తో పాటు పండుగ క్రౌడ్ వాడుకుని భారీగా వ‌సూళ్లు కొల్ల‌గొట్ట‌వ‌చ్చ‌ని ఆలోచ‌న చేస్తున్నారు. ఏదేమైనా స‌రిలేరు డేట్ విష‌యంలో అటు ఫ్యాన్స్‌తో పాటు ఇటు బ‌య్య‌ర్లు అంద‌రూ టెన్ష‌న్‌గా ఉన్నారు. మ‌రి మ‌హేష్ డెసిష‌న్ ఎలా ? ఉంటుందో ? చూడాలి.

Share.