తెలుగు చిత్రసీమలో కమెడియన్ గా తనదైన ముద్రను వేసిన వేణుమాధవ్.. అలీ-ధర్మవరపు సుబ్రమణ్యం- ఎం.ఎస్.నారాయణ-ఏవీఎస్ వంటి ప్రముఖ కమెడియన్లతో సమకాలికుడిగా పరిశ్రమలో పేరు తెచ్చుకున్నారు. మనకు ఉన్న గొప్ప కమెడియన్లలో వేణుమాధవ్ ఒకరిగా పాపులరయ్యారు. గత నాలుగైదేళ్లుగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన సినిమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు.
కొద్ది రోజులుగా ఆయనకు ఉన్న లివర్ సమస్యలకు తోడు కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా తలెత్తడంతో పరిస్థితులు తీవ్రమయ్యాయి. దీంతో ఆయన సికింద్రాబాద్లోని యశోదా హాస్పటల్లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో డాక్టర్లు ఆయనకు ఎంతో కష్టపడి చికిత్స చేస్తున్నారు. అయితే బయట మీడియాలో అత్యుత్సాహం చూపించేవాళ్లతో పాటు సోషల్ మీడియాలో ఏం తెలియకుండా రాసే గాసిప్ రాయుళ్లు మాత్రం వేణుమాధవ్ చనిపోయాడంటూ వార్తలు రాయడంతో పాటు వార్తలను చిలువలు పలవలుగా ప్రచారం చేసేశారు.
గతంలో సైతం వేణుమాధవ్ చనిపోయాడంటూ వార్తలు రావడంతో ఆయన చాలా సీరియస్ అయ్యారు. తాజా అప్డేట్ ప్రకారం వేణుమాధవ్ కు తీవ్ర అనారోగ్యం తీవ్రమైందని.. పరిస్థితి చాలా సీరియస్గా ఉందని.. వేణుమాధవ్ చికిత్స పొంది కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఏదేమైనా ఇకపై అయినా అత్యుత్సాహం చూపించకుండా వాస్తవాలు తెలుసుకుని వార్తలు ప్రచురిస్తే మంచిది. వారికి విలువలు ఉంటాయి.