థియేట‌ర్ల బిజినెస్‌లోకి టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్‌..

Google+ Pinterest LinkedIn Tumblr +

తన మాటలతోనే ప్రేక్షకులను ఆకట్టుకునే త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ప్రేక్షకులకు ప్రత్యేకమైన అభిమానం.అజ్ఞాత‌వాసి అట్ట‌ర్ ప్లాప్ త‌ర్వాత అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కుతోన్న అల వైకుంఠ‌పురంలో సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌చ్చే సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

అల్లు అర్జున్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అంటే మంచి అంచ‌నాలు ఉన్నాయి. జులాయి – సన్ అఫ్ సత్యమూర్తి తర్వాత హ్యాట్రిక్ మూవీగా దీని మీద అంద‌రికి మంచి గురి ఉంది. హారికా హాసిని బ్యానర్ ద్వారా నిర్మాణంలోనూ యాక్టివ్ గా ఉన్న త్రివిక్రమ్ కు బయట వ్యాపకాలు వ్యాపారాలు పెద్దగా ఉండవు. ఇప్ప‌టికే టాలీవుడ్‌లో కొంద‌రు డైరెక్ట‌ర్లు బ‌య‌ట థియేట‌ర్ల రంగంలోకో లేదా ఇత‌ర‌త్రా వ్యాపారాల్లోకో ఎంట్రీ ఇస్తున్నారు.

వినాయక్ ఇప్ప‌టికే ప‌లు చోట్ల థియేట‌ర్లు కొంటున్నారు. అంత‌కు ముందు నుంచే వైవిఎస్‌.చౌద‌రి ఈ రంగంలో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు త్రివిక్ర‌మ్ కూడా థియేట‌ర్ల బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. త్రివిక్ర‌మ్ తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లాలోని రాజమండ్రి దగ్గరలోని రాజానగరం రాయుడు కాంప్లెక్స్ థియేటర్ కొన్నట్టు తెలిసింది. ఈ డీల్ కొద్ది రోజుల నుంచి న‌లుగుతుండ‌గా ఎట్ట‌కేల‌కు ఫినిష్ అయ్యింద‌ట‌.ఈ బిజినెస్ ఎలా వ‌ర్క‌వుట్ అవుతుందో ? చూసి గోదావ‌రి ఏరియాల్లో మ‌రికొన్ని థియేట‌ర్ల‌ను కొనేందుకు త్రివిక్ర‌మ్ రెడీగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Share.