మెగా ఫ్యామిలీ అండ ఉన్నా.. సోలో బ్రతుకే అంటున్న మెగా హీరో..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా ఫ్యామిలీ అండదండలున్నా తనది సోలో బ్రతుకే అంటున్నాడు మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఈ హీరో మేనమామల మేనరిజాలతో క్రేజ్ తెచ్చుకున్నాడు. సుప్రీం హీరోగా అవతరించిన సాయి ధరం తేజ్ ఆరు ఫ్లాపుల తర్వాత చిత్రలహరితో హిట్టు కొట్టాడు. ప్రస్తుతం మారుతి డైరక్షన్ లో ప్రతిరోజు పండుగే సినిమాలో నటిస్తున్నాడు సాయి ధరం తేజ్. ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా తర్వాత సాయి ధరం తేజ్ సుబ్బు అనే నూతన దర్శకుడి డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ అందుకున్న నభా నటేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందట. అయితే అంతా బాగుంది కాని ఈ సినిమాకు టైటిల్ గా సోలో బ్రతుకే అనే టైటిల్ ఫిక్స్ చేశారట. ఆల్రెడీ నారా రోహిత్ సోలో సినిమా చేశాడు.

ఇప్పుడు సాయి ధరం తేజ్ సోలో బ్రతుకే అంటూ రాబోతున్నాడు. టైటిల్ చూస్తే ఇదేదో సోలో జీవిత సమస్యల గురించి చెప్పేలా ఉన్నాడు. కొత్త దర్శకుడిని నమ్మి సాయి ధరం తేజ్ బాగానే డేట్ చేస్తున్నాడని అంటున్నారు. లవ్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా సెట్స్ మీదకు వెళ్తుందట. మొత్తానికి సాయి ధరం తేజ్ టైటిల్ తో సినిమాపై అంచనాలు పెంచాడు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అన్నది తెలియాల్సి ఉంది.

Share.