టాలీవుడ్‌లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్నే నమోదు చేశాడు. కాగా ప్రస్తుతం పూరి తన తరువాత సినిమాని సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూరి విజయ్ సినిమా స్క్రిఫ్ట్ పనులతో బిజీబిజీగా ఉన్నాడు. విజయ్ సినిమా తర్వాత పూరి బాలయ్యతో సినిమా చేసేందుకు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన పైసా వసూల్ సినిమా కమర్షియల్‌గా ఎలా ఉన్నా బాలయ్య నటనా పరంగా మంచి ప్రశంసలు తెచ్చుకుంది. బాలయ్యను సరికొత్తగా ప్రజెంట్ చేయడంలో పూరి సక్సెస్ అయ్యాడు. ఇండస్ట్రీ లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా కథ కూడా ఎప్పుడో రెడీ అయిపోయిందట. ఈ కథలో బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
పైసా వసూల్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా తనను కొత్తగా చూపించడంతో ఖుషీగా ఉన్న బాలయ్య అందుకే పూరితో మరో సినిమా చేయడానికి రెడీ అయ్ఆయడట. ఇక ఈ సినిమా కథ కూడా చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. మరి పవర్ పోలీస్ ఆఫీసర్‌గా బాలయ్యను పూరి ఎలా ? ప‌్రజెంట్ చేస్తాడో ? చూడాలి.
ఇక ప్రస్తుతం కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో నటిస్తోన్న బాలయ్య ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తారు. ఆ సినిమా కంప్లీట్ అయిన వెంటనే పూరితో సినిమా చేయనున్నారు.