చరణ్ కాదంటే నేను రెడీ..

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా హీరోలందరికి ఒక్క ఫ్రేమ్ లో అయినా మెగాస్టార్ లా కనిపించాలన్న తపన ఉంటుంది. ప్రస్తుతం బయోపిక్ ల సీజన్ నడుస్తున్న కారణంగా చిరు బయోపిక్ పై మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ దగ్గర ప్రస్థావించారు మీడియా వారు. పెదనన్న బయోపిక్ చేస్తే కనుక అన్న చరణే దానికి పర్ఫెక్ట్. అయితే చరణ్ అన్న చేయకపోతే మాత్రం అది నేను చేస్తా అంటున్నాడు వరుణ్ తేజ్.

ప్రస్తుతం వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమా ప్రమోషన్స్ లో ఉన్నారు. హరీష్ శంకర్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో పూజా హెగ్దె, అధర్వ, మృణాలిని నటించారు. మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రాం ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. మెగాస్టార్ బయోపిక్ కోసం మెగా హీరోల మధ్య పోటీ జరిగేట్టు కనబడుతుంది.

అయితే చరణ్ చేస్తా అంటే మిగతా వారంతా సైలెంట్ గా ఉండాల్సిందే. రాం చరణ్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా 2020 జూలై 30న రిలీజ్ ఫిక్స్ చేశారు. హీరోగానే కాదు సైరా సినిమా నిర్మాతగా కూడా చరణ్ ఫుల్ బిజీగా ఉన్నాడు.

Share.