మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఈ సంక్రాంతికి ఎఫ్ 2 లాంటి భారీ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాక వరుణ్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. అందుకే ఇప్పుడు వాల్మీకి సినిమా ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 20 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఇక వరల్డ్ వైడ్ చూసుకుంటే 25 కోట్ల రూపాయలకు ఈ సినిమా అమ్ముడపోయింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే అటు ఇటుగా 22 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. వాల్మీకి శాటిలైట్- డిజిటల్ రైట్స్ కలుపుకుని రూ. 10 కోట్ల రేంజ్ పలికిందని తెలుస్తోంది. స్టార్ మాకి వాల్మీకి రైట్స్ ని కట్టబెట్టారట. ఈ లెక్కన చూస్తే ఓవరాల్‌గా వాల్మీకి రూ.35 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది.
వాల్మీకి ఏరియా వైజ్ ప్రి రిలీజ్ బిజినెస్ ఇలా ఉంది (రూ.కోట్లలో) :
నైజాం – 7.40 కోట్లు
సీడెడ్ – 3.35 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.40 కోట్లు
ఈస్ట్ – 1.60 కోట్లు
వెస్ట్ – 1.10 కోట్లు
గుంటూరు – 1.80 కోట్లు
నెల్లూరు – 0.75 కోట్లు
కృష్ణా – 1.60 కోట్లు