నాని ‘ గ్యాంగ్ లీడ‌ర్ ‘ ఫ‌స్ట్ వీకెండ్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌

Google+ Pinterest LinkedIn Tumblr +

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన సినిమా గ్యాంగ్ లీడర్. సినిమాకు మిక్స్ డ్ టాక్ వ‌చ్చినా సోలోగా రావ‌డంతో ఫ‌స్ట్‌ వీకెండ్ వసూళ్లు ఆశించిన స్థాయిలోనే వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు రూ 3.76 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా మూడు రోజుల్లో దాదాపుగా 16 కోట్ల రూపాయలని వసూలు చేసింది.

మిక్స్ డ్ టాక్‌తో కూడా ఈ రేంజులో వ‌సూళ్లు సాధించ‌డం అంటే మామూలు విష‌యం కాదు. విక్రమ్ కె కుమార్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా, కార్తికేయ విలన్ గా నటించాడు. ఫ‌స్ట్ వీకెండ్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ డీటైల్స్ ఇలా ఉన్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప్రి రిలీజ్ బిజినెస్‌తో పోలిస్తే 52 శాతం రిక‌వ‌రీ చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ వీక్ కంప్లీట్ అయ్యే స‌రికే సులువుగా బ్రేక్ ఈవెన్ దాటేస్తుందని అంటున్నారు.

గ్యాంగ్ లీడ‌ర్ ఫ‌స్ట్ వీకెండ్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ (రూ.కోట్ల‌లో) :

నైజాం – 1.53 కోట్లు

సీడెడ్ – 47 లక్షలు

ఉత్తరాంధ్ర- 46.56 లక్షలు

తూర్పు గోదావరి- 28 లక్షలు

పశ్చిమ గోదావరి- 22 లక్షలు

గుంటూరు- 31.58 లక్షలు

కృష్ణ- 34.56 లక్షలు

నెల్లూరు- 12 లక్షలు

మూడు రోజుల వ‌ర‌ల్డ్ వైడ్‌ షేర్: 16.05 కోట్లు (ఇప్ప‌టి వ‌ర‌కు రిక‌వ‌రీ 52 శాతం)

గ్యాంగ్ లీడర్ ప్రీ రిలీజ్ బిజినెస్: 31.15 కోట్లు

Share.