రియల్ టైగర్ తో యంగ్ టైగర్.. ఆర్.ఆర్.ఆర్ స్పెషల్ అప్డేట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. ఎన్.టి.అర్, రాం చరణ్ నటిస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమా గురించి ఎలాంటి చిన్న వార్త వచ్చినా సరే అది వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం బల్గేరియాలో షూటింగ్ జరుపుకుంటున్న ట్రిపుల్ ఆర్ మూవీ సినిమాలో తారక్ సీన్స్ షూట్ చేస్తున్నారట. సినిమాలో ఎన్.టి.ఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. ఓ సన్నివేశంలో మన యంగ్ టైగర్ రియల్ టైగర్ తో ఫైట్ చేస్తాడట.

బాహుబలి సినిమాలో భళ్లాలదేవ బుల్ ఫైట్ చేశాడు. అయితే టైగర్ ఫైట్ అంతకుమించి ఉండేలా చూస్తున్నాడట. యంగ్ టైగర్ తో రియల్ టైగర్ ఫైట్.. ఈ సీన్ లో తారక్ ఉగ్రరూపం చూపిస్తారని తెలుస్తుంది. ఇక సినిమాలో రాం చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇద్దరు స్టార్స్ తమ బెస్ట్ అవుట్ పుట్ ఇస్తున్నారట. 2020 జూలై 30న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ప్లాన్ చేశారు.

తప్పకుండా ఈ సినిమా మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఆర్.ఆర్.ఆర్ సినిమా ఎలా ఉండబోతుంది. అసలు తారక్, రాం చరణ్ లుక్ ఎలా ఉంటుంది అన్న విషయాల మీద ఫ్యాన్స్ ఎక్సైటింగ్ గా ఉన్నారు. తప్పకుండా ఈ సినిమా బాహుబలిని మించేలా రికార్డులు సృష్టిస్తుందని చెప్పొచ్చు.

Share.