మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి.. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్పై హీరో మెగా పవర్స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ స్పీడ్ పెంచారు.. అందులో భాగంగా ఈ నెల 18వ తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
అయితే ముందుగా ప్రకటించిన ప్రకారం… ఈ వేడుకకు తెలంగాణ మంత్రి కేటీఆర్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకధీర ఎస్ఎస్ రాజమౌళి, సక్సెస్పుల్ డైరెక్టర్ కొరటాల శివ, మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్.. అతిథులుగా రానున్నారు అని సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. దీంతో మెగా అభిమానులు అనందం వ్యక్తం చేయడమే కాకుండా సినిమాకు భారీ హైప్ క్రియోట్ అయింది.
అయితే ఈ ప్రకటన వచ్చిన కాసేపటికే మరో ప్రకటన చేసింది కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ.. ‘సైరా’ ప్రీ రిలీజ్ మరియు ట్రైలర్ విడుదల ఈవెంట్కు కేటీఆర్ రావడం లేదు.. అధికారిక పనులతో బిజీగా ఉండడంతో ఈ ఈవెంట్కు కేటీఆర్ రావడం లేదని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ ట్విట్టర్లో ప్రకటించింది. కాగా, హీరో రామ్ చరణ్, మంత్రి కేటీఆర్కు మంచి మిత్రుడన్న సంగతి తెలిసిందే. అయితే ఫ్రీ రిలీజ్ కార్యక్రమాని వస్తాడా రాడా అనేది చిత్ర యూనిట్ ప్రకటించనప్పటికి మంత్రి కేటీఆర్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడం విశేషం.