మెగాస్టార్కు కండల వీరుడి సపోర్టు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవికి బాలీవుడ్ కండల వీరుడు సపోర్టు ఇవ్వనున్నాడట. అందుకు సంబంధించిన ఓ లేటేస్ట్ అప్డేట్ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు అయింది. ఇంతకు ఎందుకు మెగాస్టార్కు ఈ కండల వీరుడు సపోర్టు చేస్తున్నాడు.. ఇంతకు కండల వీరుడికి మెగాస్టార్కు లింక్ ఏంటీ అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.

మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన చిత్రం సైరా. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 2న విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ ముమ్మరం చేసింది. అందులో భాగంగానే చిత్రంకు సంబంధించిన అప్డేట్స్ను లీక్ చేస్తూ చిత్ర యూనిట్ బిజిగా ఉంది. చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రోడక్షన్ కంపెనీ సైరా సినిమాకు విషయాలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ చిత్రం పై భారీ హైప్ను క్రియోట్ చేస్తుంది.

అయితే సైరా సినిమా బాలీవుడ్ లో పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నద్దమవుతుంది. అందులో భాగంగా బాలీవుడ్ లో సైరా సినిమా ప్రమోషన్ ఈవెంట్ను త్వరలో నిర్వహించేందుకు సన్నహాలు చేస్తున్నాడట చిత్ర నిర్మాత, మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ్. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమానికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ఖాన్ను ముఖ్యఅతిధిగా రానున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రమోషన్ కార్యక్రమం ఎక్కడ ఎప్పుడు నిర్వహిస్తారో వెల్లడించలేదు.. సో బాలీవుడ్లో సైరాకు సల్మాన్ అండగా నిలువనున్నాడన్న టాక్తో సినిమాపై భారీ హైప్ పెరిగిపోతుంది.

Share.