ఇంతకీ కాజల్ ప్లాన్ బి అదిరిపోయేలా ఉంది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సౌత్ లో దశాబ్ధ కాలంపైగా క్రేజీ హీరోయిన్ గా ఇప్పటికి మంచి అవకాశాలను అందుకుంటుంది కాజల్ అగర్వాల్. తెలుగు తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్న కాజల్ ఇప్పటికి మంచి ఫాం లో ఉందని చెప్పొచ్చు. తెలుగులో సీత, రణరంగం ఫెయిల్యూర్ అయినా తమిళంలో నటించిన కోమాలి సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక తమిళంలో క్వీన్ రీమేక్ గా వస్తున్న ప్యారిస్ ప్యారిస్ సినిమా సెన్సార్ ట్రబుల్స్ లో ఉంది.

ఇదిలాఉంటే కాజల్ మైండ్ లో ప్లాన్ బీ కూడా ఉందట. తెలుగు తమిళ భాషల్లో అవకాశాలు తగ్గినా సరే కాజల్ బాలీవుడ్ లో ఛాన్సులు అందుకుంటుంది. అక్కడ దర్శక నిర్మాతలకు హిందిలో చేసేందుకు తాను సిద్ధమని మెసేజ్ ఇచ్చిందట. అందుకే జాన్ అబ్రహం సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. బాలీవుడ్ కు వెళ్లే ప్రతి సౌత్ హీరోయిన్ అక్కడ గ్లామర్ డోస్ పెంచేస్తుంది. అపుడెపుడో అక్షయ్ కుమార్ తో స్పెషల్ చబ్బీస్ సినిమా చేసిన కాజల్ మళ్లీ బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్ అందుకుంది.

ఆ సినిమా ఫలితం మీద అమ్మడి బాలీవుడ్ కెరియర్ ఆధారపడి ఉందని చెప్పొచ్చు. అయితే కాజల్ మాత్రం తెలుగు, తమిళ సినిమాలతో పాటుగా హింది సినిమాలను వరుస గా చేయాలని చూస్తుంది. అక్కడ వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని చేజార్చుకోకూడదని అనుకుంటుంది. మరి కాజల్ ప్లాన్ బి ఏమేరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

Share.