‘ ర‌ణ‌రంగం ‘ 4 డేస్ క‌లెక్ష‌న్స్‌…

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ హీరో శ‌ర్వానంద్ న‌టించిన లేటెస్ట్ మూవీ ర‌ణ‌రంగం. స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా మ‌రో యంగ్ హీరో అడ‌వి శేష్ సినిమాతో పోటీ ప‌డి మ‌రి రిలీజ్ అయిన ర‌ణ‌రంగంకు మిక్స్‌డ్ టాక్ వ‌చ్చింది. సుధీర్ వర్మ దర్శకత్వం వ‌హించిన ర‌ణ‌రంగం విమర్శకులను మరియు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.

గురువార‌మే రిలీజ్ కావ‌డంతో 4 రోజుల సుదీర్ఘ వారాంతం కూడా సినిమాకు క‌లిసి వ‌చ్చింది. తొలి నాలుగు రోజుల‌కు గాను ర‌ణ‌రంగం రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ .7.66 కోట్ల థియేట్రికల్ షేర్ వసూలు చేసింది. ర‌ణ‌రంగంకు ఎవ‌రు సినిమా నుంచి అన్ని ఏరియాల్లోనూ గ‌ట్టి పోటీ ఎదురైంది. ఇక ఓవ‌ర్సీస్‌లో కూడా ఈ సినిమాను మించి ఎవ‌రు దూసుకుపోతోంది. రూ.16 కోట్ల థియేట్రిక‌ల్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఎంత వ‌ర‌కు బ్రేక్ ఈవెన్ చేరుకుంటుందో ? అన్న‌ది సందేహ‌మే.

ర‌ణరంగం ఏరియా వైజ్ క‌లెక్ష‌న్లు : (రూ.కోట్ల‌లో)

నైజాం – 2.75

సీడెడ్ – 1.23

ఉత్త‌రాంధ్ర – 1.10

ఈస్ట్ – 0.51

వెస్ట్ – 0.47

కృష్ణా – 0.55

గుంటూరు – 0.73

నెల్లూరు – 0.32
—————————————————
4 డేస్ ఏపీ , తెలంగాణ షేర్ = 7.66 కోట్లు
—————————————————

Share.