సొంతం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన నమిత ఆ తర్వాత తన గ్లామర్ షోతో హాట్ ఇమేజ్ సొంతం చేసుకుంది. తన సోయగాలతో యూత్ ఆడియెన్స్ ను తన బుట్టలో వేసుకున్న ఈ అమ్మడు 2010 తర్వాత పెద్దగా సినిమాల్లో నటించలేదు. 2016లో వచ్చిన పులి మురుగన్ సినిమాలో నటించినా నమిత పెద్దగా ఆకట్టుకోలేదు. 2017లో పెళ్లి చేసుకున్న నమిత మళ్లీ సినిమాల్లో నటించాలని చూస్తుందట.
పెళ్లికి ముందు వరకు బాగా లావెక్కిన నమిత ఈమధ్య స్లిం గా తయారైందని తెలుస్తుంది. రీసెంట్ గా సన్నబడిన నమిత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఓ తమిళ సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో ఇక మీదట వరుస సినిమాలు చేయాలని చూస్తుంది నమిత. మరి నమిత రీ ఎంట్రీ ఎలా ఉండబోతుందో చూడాలి.
ఒకప్పుడు అంటే పెళ్లి తర్వాత హీరోయిన్స్ అంతా పెట్టా బేడా సర్ధేయాల్సిందే. కాని పరిస్థితి మారింది. సమంత వారికి బెస్ట్ ఉదాహరణగా నిలుస్తుంది. పెళ్లి తర్వాత కూడా సమంత వరుస సినిమాలు చేస్తుంది. ఇప్పుడు నమిత కూడా పెళ్లి తర్వాత కెరియర్ కొనసాగించాలని చూస్తుంది. టాలీవుడ్, కోలీవుడ్ లో నమితకు క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. మరి వారికి నమిత రీ ఎంట్రీ సంతోషపరచే వార్త అని చెప్పొచ్చు.