రౌడీ హీరోయిన్ అంటే ఎవరో తెలుసా… అదేనండీ గీతా గోవిందం భామ రష్మీక మందన్న. రష్మీక మందన్న సెట్‌లో ఉంటే అక్కడంతా సందడే సందడట… అందరు హీరోయిన్లలాగా కాదంట రష్మీక మందన్న. ఆమే ఏ సినిమా షూటింగ్‌లో ఉన్నా అందరిని ఆట పట్టిస్తూ… అందరితో సరదా ఉంటూ… చిత్ర బృందంతో సన్నిహితంగా ఉంటూ… సినిమాను ఓ ప్రోఫెషనల్‌గా కాకుండా ఓ ఆట విడుపుగా మార్చేస్తుందట రష్మీక మందన్న.
అయితే రష్మీక మందన్న టాలీవుడ్‌లో తెరంగ్రేటం చేసింది ఛలో సినిమాతో. ఈ సినిమా దర్శకుడు వెంకి కుడుముల. ఒకరకంగా వెంకి కుడుముల రష్మీకకు గురువులాంటి వాడన్నమాట. అయితే ఆమే దర్శకుడు వెంకి కుడుములతో చాలా సన్నిహితంగా ఓ స్నేహితురాలిగా ఉంటుందట. అయితే ఇప్పుడు అదే వెంకి కుడుములతో భీష్మ సినిమాలో నటిస్తుంది రష్మీక. భీష్మ సినిమా హీరో నితిన్. రష్మీకకు దర్శకుడు వెంకి కుడుముల మంచి స్నేహితులు కావడంతో ఇక సినిమా షూటింగ్ సెట్స్‌లో సందడి మరింత పెరిగిందట.
భీష్మ సినిమా షూటింగ్ సందర్భంగా నటి రష్మీక నిక్‌నేమ్ బయటకొచ్చింది. వెంకి కుడుముల రష్మీకను నిక్‌నేమ్‌తోనే పిలవడం, ఆ పేరును ఏకంగా నిక్‌నేమ్‌ను సినిమా హీరో ముందే చెప్పడంతో రష్మీకను ఆటపట్టించాడట వెంకి కుడుముల. ఇంతకు రష్మీక మందన్న నిక్ నేమ్ ఏంటో అనే అతృత మీలో కలుగుతుంది కదా… అదేనండీ ఎండాకాలంలో మనం బాగా ఇష్టపడి తినే పుచ్చకాయ్ అండి… రష్మీక మందన్న నిక్‌నేమ్ పుచ్చకాయ. ఈ నిక్ నేమ్ ఎందుకు వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…