మన సినిమాలు అనే పుస్తకాన్ని జనసేన అధ్యక్షుడు, సిని నటుడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఆ పుస్తకాన్ని ప్రజాశక్తి సంపాదకులు తెలకపల్లి రవి సంపాదకత్వంలో వెలువడింది. ఈసినిమా చరిత్రను నిక్షిప్తం చేసిన ఈ పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లోని ఫిలింనగర్ ఫిలించాంబర్ హాల్ జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు.
మన సినిమాలు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ మన సినిమాలు అనే పుస్తకం ప్రతి నటి నటులకు, సాంకేతిక నిపుణులకు ఓమార్గదర్శిగా నిలుస్తుందని చెప్పారు. పుస్తకం తోడుంటే… మన వెంట విజ్ఞానం, వివేకం వెంట ఉన్నట్లే అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డాడు. అయితే పవన్ కళ్యాణ్ తో పాటు పాల్గొన్న పరుచూరి గోపాలకృష్ణ, తనికెళ్ళ భరణి, సుద్దాల అశోక్‌తేజ, ప్రజాశక్తి సంపాదకులు తెలకపల్లి రవి సినిమా చరిత్ర గురించి పూసగుచ్చినట్లు వివరించారు..
ఈ పుస్తకంలో సినిమాలు ఎలా పుట్టాయి… ఎక్కడ పుట్టాయి… ఎందుకు పుట్టాయి… పుట్టిన సినిమా రంగం ఎలా విస్తరించింది… గతంలో సినిమా రంగం ఎలా ఉంది.. వర్తమానంలో సినిమా రంగం ఎలా ఉంది.. భవిష్యత్‌లో ఎలా ఉంటుందనేది ఈ పుస్తకంలో విఫులంగా రాసినట్లు అర్థమవుతుంది. మొత్తానికి సినిరంగానికి ఈ పుస్తకం ఓ దిక్సూచిగా నిలిచిపోవడం ఖాయమన్నమాట.