విజయ్ దేవరకొండ ప్రస్తుతం తెలుగులో మంచి ఫామ్ లో ఉన్నాడు, వరుస హిట్లతో కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నాడు ఈ యువ హీరో. ఇక తాజాగా అర్జున్ రెడ్డి సినిమాతో మొదటి సారి ఫిలిం ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు విజయ్. అయితే ఆ రోజే ఈ అవార్డు ని అమ్మి వచ్చిన డబ్బుని సిఎం సహాయ నిధికి ఇవ్వనున్నట్టు తెలిపారు విజయ్ దేవరకొండ. అందులో భాగంగా నిన్న రాత్రి ఈ అవార్డు ని వేలం పాట వేయగా దివీస్ ల్యాబ్స్ వారు 25 లక్షలు ఇచ్చి ఈ అవార్డు సొంతం చేసుకున్నారు. అయితే ఇది విజయ్ కి తొలి ఫిలిం ఫేర్ అవార్డు అయినందున దివీస్ ల్యాబ్స్ యాజమాన్యం ఈ అవార్డు తిరిగి విజయ్ కి ఇచ్చెదమని భావించగా విజయ్ మాత్రం డబ్బులు తీసుకున్నాక అవార్డు తన వద్ద పెట్టుకోవటం సమంజసం కాదని అన్నారట. ఇక విజయ్ నిన్న రాత్రి తెలంగాణ ఐ టీ శాఖ మంత్రి శ్రీ కే టీ ఆర్ గారికి
” కె టీ ఆర్ అన్న మిమల్ని కలిసి వెంటనే ఈ 25 లక్షలు ఇవ్వాలి అని ఎదురు చూస్తున్న ” అని ట్వీట్ చేసారు. దీనికి స్పందించిన కె టీ ఆర్ ” కంగ్రాట్స్ విజయ్ నువ్వు చేసిన ఈ మంచి పనికి” అని బదులు ఇచ్చారు.
Congratulations on a good deed Vijay 👍 https://t.co/HxFJylSCcv
— KTR (@KTRTRS) July 15, 2018