టాలీవుడ్ లో ఎలాంటి అండ లేకుండా అగ్రహీరోగా ఎదుగుతున్న విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే కళ్ళు తిరిగి పడిపోవాల్సిందే… ఓ టాప్ హీరో రేంజ్లో ఫ్రీ రిలీజ్ బిజినేస్ కావడం ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్లో భారీ అభిమానులను సొంతం చేసుకుంటున్న విజయ్ దేవరకొండ సినిమాలను ఎగబడి చూస్తున్నారు. ఇదే అదనుగా అటు నిర్మాతలు, ఇటు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా విజయ్ దేవరకొండను బంగారు బాతుగా చూసుకుంటున్నారు…
ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మీక మందన్న నటించిన డియర్ కామ్రేడ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ భారీగా చేసిందనే చెప్తున్నారు సిని విశ్లేషకులు. సుమారు 50కోట్ల ఫ్రి రిలీజ్ బిజినేస్ చేయడం అంటే మాటలు కాదంటున్నారు… థియోట్రికల్ హక్కులే రూ.40కోట్లకు అమ్ముడు పోయాయట. ఇక డిజిటల్, శాటిలైట్ హక్కులు రూ.10కోట్ల మేరకు అమ్మారట. సో రెండు కలిపితే రూ.50కోట్ల బిజినెస్ అయింది.
నైజాం ఏరియాలో రూ.9కోట్లు, సీడెడ్ ఏరియాలో 3.5కోట్లు, కృష్ణా జిల్లాలో 1.5కోట్లు, నెల్లూరులో 80లక్షలు, గుంటూరులో రూ.2కోట్లు, వైజాగ్ లో 2.5కోట్లు, ఉభయ గోదావరి జిల్లాలకు 3.20కోట్లకు థియోట్రికల్ హక్కులను అమ్మినట్లు ఇప్పుడు టాలీవుడ్ లో ప్రచారం సాగుతుంది. ఇక ఓవర్సీస్ లో రూ.4కోట్లకు అమ్మినట్లు తెలిసింది. ఇలా డియర్ కామ్రేడ్ టేబుల్ పైనే లాభాల పంట పండించినట్లుగా చిత్ర పరిశ్రమలోని పెద్దలు గుసగుసలాడుతున్నారు.