ఆరు రోజులు… రూ.56కోట్ల వసూళ్లు… ఇది యంగ్ ఎనర్జీటిక్ హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా కలెక్షన్ల తీరు. హీరో రామ్ కేరీర్లోనే భారీ వసూళ్ళు సాధించిన చిత్రంగా ఇస్మార్ట్ శంకర్ సినిమా నిలిచింది. రామ్ నటించిన అన్ని చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా భారీ వసూళ్ళను సాధిస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే లాభాల్లో మునిగితేలుతున్న చిత్ర యూనిట్ ఇప్పుడు మరింత లాభాల కోసం ఎదురు చూస్తుంది.
పూరి జగన్నాథ్ రామ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీసు కాసుల గలగలతో నిండిపోతుంది. చిత్రం విడుదలైన రెండు రోజులు అడ్వాన్స్ బుకింగ్లపైనే నడిచిన సినిమా తరువాత నాలుగు రోజులు రోజు టికెట్ అమ్మకాలతో సినిమా హౌస్పుల్గా రన్నవుంతుంది. రామ్ కేరీర్లో ఇదో మైలురాయిగా మిగిలిపోయే సినిమాగా నిలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ.56కోట్ల కలెక్షన్ రాబట్టిన ఈ సినిమా ఓవర్సీస్ లో మాత్రం నిరాశజనకంగానే ముందుకు సాగుతుంది.
ఇస్మార్ట్ శంకర్ కు అటు బోనాలు కలిసి రాగా, ఏ పెద్ద హీరో సినిమాలు కూడా విడుదల కాకపోవడంతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తుంది.