అజయ్ భూపతి డైరక్షన్ లో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ కలిసి నటించిన సినిమా ఆరెక్స్ 100. ఇంక్రెడిబుల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా యూత్ ఆడియెన్స్ మెప్పు పొందింది. సినిమాలో రొమాన్స్ సీన్స్ అయితే కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతున్నాయి. సినిమా మొదటి రోజు టాక్ ఎలా ఉన్నా కలక్షన్స్ మాత్రం బీభత్సంగా ఉన్నాయి.
నాలుగవ రోజు కూడా కోటి రూపాయల షేర్ తో ఆరెక్స్ 100 సంచలనం సృష్టిస్తుంది. కేవలం 3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయిన ఈ సినిమా రెండో రోజే లాభాల బాట పట్టింది. ఇకనుండి వచ్చేదంతా లాభాలే అని చెప్పొచ్చు.
ఏరియాల వారిగా ఆరెక్స్ 100 కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే..
ఉత్తరాంధ్ర : 0.61 కోట్లు
నైజాం : 2.42 కోట్లు
సీడెడ్ : 0.59 కోట్లు
కృష్ణా : 0.35 కోట్లు
గుంటూర్ : 0.36 కోట్లు
నెల్లూరు : 0.12 కోట్లు
ఈస్ట్ : 0.42 కోట్లు
వెస్ట్ : 0.32 కోట్లు
ఏపి/తెలంగాణా : 5.19 కోట్లు.