శంకర్ బాక్సాఫీస్ జోరుకు నో బ్రేక్… 5 డేస్ కలెక్షన్స్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇస్మార్ట్ శంకర్ మిక్స్ డ్ టాక్తోనూ ఊహించని వసూళ్లు సాధిస్తుండడంతో ఈ సినిమా యూనిట్తో పాటు సినిమా కొన్న బయ్యర్ల ఆనందానికి అవధులే లేవు. ఇప్పటికే రూ.18 కోట్ల బ్రేక్ ఈవెన్ దాటేసిన శంకర్ సోమవారం ఐదో రోజు కూడా నిలకడగా వసూళ్లు సాధించింది. సోమవారం రెండు తెలుగు రాష్ట్రాలోనూ కలిపి రూ 2.2 కోట్ల షేర్ కొల్లగొట్టింది.

సోమవారం వసూళ్లతో కలుపుకుంటే ఇస్మార్ట్కు మొత్తం రూ 22.80 కోట్ల షేర్ వచ్చింది. ఇప్పటికే రూ.5 కోట్లకు పైగా లాభాల్లో సినిమా నడుస్తోంది. నిర్మాతలుగా ఉన్న పూరి, ఛార్మీకి మరిన్ని లాభాల పంట పండనుంది. ముఖ్యంగా బీ, సీ సెంటర్ల ప్రేక్షకులతో పాటు యూత్కు సినిమా బాగా కనెక్ట్ అవ్వడంతో మంచి వసూళ్లు వస్తున్నాయి.

ఇస్మార్ట్ 5 డేస్ ఏరియా వైజ్ కలెక్షన్స్ : (రూ.కోట్లలో)

నైజాం – 9.79

సీడెడ్ – 4.03

నెల్లూరు – 0.79

కృష్ణ – 1.44

గుంటూరు – 1.47

వైజాగ్ – 2.62

ఈస్ట్ – 1.46

వెస్ట్ – 1.20

ఏపీ + టీస్ షేర్ = 22.80

Share.