రవితేజ, సిద్ధార్థ.. మాస్ క్లాస్ కాంబో..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా అజయ్ భూపతి డైరక్షన్ లో వస్తున్న సినిమా మహా సముద్రం. ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆరెక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అజయ్ భూపతి రామ్, నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్ లకు కథలు వినిపించి వారెవరు సినిమా ఒప్పుకోకపోవడంతో ఫైనల్ గా రవితేజతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. జెమిని కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మరో సర్ ప్రైజ్ కూడా ఉందట.

అదేంటి అంటే సినిమాలో మరో హీరో సిద్ధార్థ్ కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో తెలుగులో సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న సిద్ధార్థ్ 2017లో గృహం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇన్నాళ్లకు మళ్లీ సిద్ధార్థ్ కు ఓ తెలుగు ఆఫర్ వచ్చింది. మాస్ రాజా, క్లాస్ హీరో ఈ కాంబో క్రేజీగా మారనుంది.

ఆరెక్స్ 100తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అజయ్ భూపతి మహా సముద్రం సినిమాను కూడా క్రైం థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిస్తున్నాడట. ఈ సినిమాలో సిద్ధార్థ్ కు మంచి రోల్ ఇచ్చారట. రవితేజకు జోడీగా అదితి రావు హైదరి నటిస్తుండగా సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.

Share.